సాయితేజ్ కొత్త టైటిల్ ఇదేనా?

Sai Dharam Tej

“సోలో బ్రతుకే సో బెటర్” సినిమాను పూర్తిచేసిన సాయితేజ్, కొత్త సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. దర్శకుడు దేవకట్టాతో కలిసి డిస్కస్ చేస్తున్న ఫొటోను కూడా సాయితేజ్ ఆమధ్య విడుదల చేశాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయితేజ్ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ ను దసరా సందర్భంగా నిన్ననే ప్రకటించాలని అనుకున్నారట. కానీ ఆఖరి నిమిషంలో ఆగిపోయారు.

ప్రస్తుతానికైతే ‘రిపబ్లిక్’ ను వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేసిన యూనిట్, దీన్నే కంటిన్యూ చేయాలా లేక మరో మంచి టైటిల్ పెట్టాలా అనే ఆలోచనతో దసరా ను మిస్ చేసుకుంది.

ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా రాబోతోంది ఈ సినిమా. తన కెరీర్ లో సాయితేజ్ చేస్తున్న పొలిటికల్ బేస్డ్ మూవీ ఇదే. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది.

Related Stories