- Advertisement -

సాయి ధరమ్ తేజ్ మరో సినిమా ఒప్పుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఇంతవరకు షూటింగ్ లో పాల్గొనలేదు. ఐతే, తాజాగా ఒక మాస్ సినిమా ఒప్పుకున్నట్లు టాక్. ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సీటిమార్’ వంటి మాస్ సినిమాలు తీసిన సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడట.
‘సీటిమార్’ తర్వాత ఒక హీరో కోసం వెతుకుతున్న సంపత్ నందికి సాయి తేజ్ దొరికాడన్నమాట. వరుసగా పెద్ద సినిమాలు తీస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుందని సమాచారం.
సాయి తేజ్ ప్రస్తుతం ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. వచ్చే రెండు, మూడు నెలల్లో షూటింగ్ మొదలు పెడుతాడు.