
Bigg Boss Telugu 4 – Episode 8
హమ్మయ్య.. వారం రోజుల ఇబ్బందుల నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్-4కు కాస్త ఊపొచ్చింది. కాస్త ఉత్కంఠ, ఇంకాస్త ఫన్, మరెన్నో ఎంటర్ టైన్ మెంట్ చూపిస్తూ.. తన అసలైన ఫ్లేవర్ ను అందించాడు బిగ్ బాస్. ఇన్నాళ్ల నీరసానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన అన్ని ఎపిసోడ్స్ లో ఆదివారం ఎపిసోడ్ హైలెట్. ఎలిమినేషన్ రౌండ్ తో పాటు ఆటపాట ఉండడంతో అంతా హాయిగా సాగిపోయింది.
Bigg Boss Telugu 4 తొలి ఎలిమినేషన్ విషయానికొస్తే.. అంతా ఊహించినట్టే బిగ్ బాస్ సీజన్-4 తొలి ఎలిమినేషన్ లో దర్శకుడు సూర్యకిరణ్ బయటకెళ్లిపోయాడు. ఓవైపు అతడి ఎలిమేషన్ పై ఆల్రెడీ లీకులు రావడం, మరోవైపు హౌజ్ లో సూర్యకిరణ్ వ్యవహారశైలి కూడా అలానే ఉండడంతో ఆయన ఎలిమేషన్ పై పెద్దగా ఎవరికీ షాకింగ్ అనిపించలేదు. ఆ వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద కుమార్ సాయిని హౌజ్ లోకి పంపించాడు నాగ్.
Also Read: Bigg Boss Telugu 4 – Episode 7 Review
ఎలిమినేషన్ కంటే ముందు జరిగిన ఆటపాట రంజుగా సాగింది. లేడీ గ్రూప్, జెంట్స్ గ్రూప్ అంటూ రెండు గ్రూపులు చేసిన నాగార్జున.. డాన్సింగ్ పోటీ పెట్టాడు. కంటెస్టెంట్స్ అంతా సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డాన్స్ చేశారు. హౌజ్ నుంచి బయటకు వెళ్లేముందు సూర్యకిరణ్ తన స్టెప్పులతో ఇరగదీయగా.. ఊహించని విధంగా గంగవ్వ కూడా స్టెప్పులు ఇరగదీసింది. ఏకంగా రాజశేఖర్ మాస్టర్ తో కలిసి “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” సాంగ్ కు డాన్స్ చేసింది.
ఈ కాన్సెప్ట్ తో పాటు కంటెస్టెంట్లను కొన్ని రకాల జంతువులను పోలుస్తూ సూర్యకిరణ్ ఇచ్చిన విశ్లేషణ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇవాళ్టి నుంచి కొత్తగా ఎంటరైన కుమార్ సాయితో హౌజ్ లో కార్యకలాపాలు సాగుతాయి.