ఆయనకి ముద్దు పెట్టలేదు!

- Advertisement -


హీరోయిన్ సాయి పల్లవి కొన్ని నియమాలు పెట్టుకొంది. అందాల ప్రదర్శనకి ఒప్పుకోదు. అలాగే, ముద్దు సీన్లకు దూరం. ఈ రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తుంది. మరి, ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరి ‘ సినిమాలో రెండు ముద్దు సీన్లు ఉన్నాయి కదా!

ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే… అది ఒక ట్రిక్ అని చెప్తోంది. తాను నాగ చైతన్యని ముద్దు పెట్టుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. కెమెరా ట్రిక్, ఎడిటింగ్ మాయాజాలంతో ఆ భావన కలిగేలా చేశారట మేకర్స్. అలా తన రూల్ ని బ్రేక్ చెయ్యలేదు అని చెప్తోంది సాయి పల్లవి.

సాయి పల్లవి అద్భుతంగా నటిస్తుంది. అంతకన్నా అందంగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే ఎనర్జీ వేరు. అందుకే, ఆమె తన పంథా వీడడం లేదు. వచ్చిన సినిమాలని ఒప్పుకునే రకం కాదు ఆమె. తనకు నచ్చిందే చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమానే తిరస్కరించింది అంటే ఆమె తన విలువల విషయంలో ఎంత కట్టుబడి ఉందో అర్థం అవుతోంది.

లవ్ స్టోరి’ కథ ప్రకారం ముద్దు సీన్లు చాలా కీలకం. కథలో ఎమోషన్ కి అవి అవసరం. అందుకే, కెమెరా ట్రిక్ తో మేనేజ్ చేసింది. సినిమా కథకు న్యాయం జరిగింది, తన రూల్ కూడా బ్రేక్ కాలేదు.

 

More

Related Stories