ఆ మూడింటిపై సాయి పల్లవి ధీమా

- Advertisement -
Sai Pallavi

సాయి పల్లవి కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకోవడం లేదట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో నటించే అవకాశాన్ని కాదనుకుంది. చిన్న పాత్ర అనే కారణంతో తిరస్కరించింది.

ఆమె నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే, నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఇప్పటికే సగం పూర్తి అయింది. ఈ మూడు సినిమాలు తనకి మరింత పేరు తెస్తాయి అని ధీమాగా ఉంది సాయి పల్లవి. బలమైన హీరోయిన్ పాత్రలుంటే ఆమెనే సంప్రదిస్తున్నారు మేకర్స్. హీరోలకి సమానంగా ఆమె కోసం పాత్రలను తీర్చిదిద్దుతున్నారు.

బడా కమర్షియల్ సినిమాల కన్నా ఇలాంటి మీడియం రేంజ్ సినిమాలే బెస్ట్ అనుకొంటోంది. అందుకే, పెద్ద హీరోల సరసన చిన్న పాత్రలు చేసేందుకు అంగీకరించడం లేదు.

 

More

Related Stories