
సాయి పల్లవి నటనకు వంక పెట్టలేం. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె నటన సూపర్ గా ఉంటుంది. చిలిపి పాత్రల్లో అయినా, సీరియస్ రోల్స్ అయినా… చించేస్తుంది తన యాక్టింగ్ తో. తాజాగా ఒక వెబ్ డ్రామాతో ఆమె పేరు మార్మోగుతోంది.
“పావ కథైగల్ ” (పాపపు కథలు) అనే వెబ్ డ్రామా తమిళంలో రూపొందింది. ఇందులో, నాలుగు కథలున్నాయి. ఒక్కో కథని ఒక్కో దర్శకుడు/రాలు తీశారు. ఒక కథలో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ తండ్రీకూతుళ్లుగా నటించారు. ఇంటర్ కాస్ట్ పెళ్లికి సంబంధించిన ఈ కథని వెట్రిమారన్ డైరెక్ట్ చేశాడు. ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సింది ఏముంది. నేషనల్ అవార్డు విన్నర్. తండ్రిగా అదరగొట్టారు.
ఇక సాయి పల్లవి ఈ చిన్న కథలో కూడా తన మార్క్ ఏంటో చూపించింది అనేది క్రిటిక్స్ మాట. సాయి పల్లవి త్వరలోనే తెలుగులో “విరాటపర్వం”లో మరోసారి మెస్మరైజ్ చేసే రోల్ లో కనిపించనుంది. తెలంగాణ సింగర్ గా ఆమె కనిపిస్తుంది.