సాయి పల్లవి వెంట పడ్డ జనం

Sai Pallavi

సాయి పల్లవి మెడిసిన్ చదువుకొంది. తాజాగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసింది. ఈ కరోనా టైంలో కూడా సీరియస్ గా చదువుకొని మొన్న పరీక్షలు రాసింది ఈ ఫిదా బ్యూటీ. ఐతే, పరీక్ష రాసేందుకు చెన్నై వెళ్లిన సాయి పల్లవిని చుట్టుముట్టారట ఆమె అభిమానులు.

పరీక్షా కేంద్రం నుంచి బయటికి రాగానే సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారట. మొత్తం జనం అంతా ఆమెను చుట్టుముట్టడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయి పల్లవికున్న క్రేజ్ అది. తెలుగులోనే కాదు తమిళనాట కూడా సాయి పల్లవి వెరీ పాపులర్. ధనుష్ నటించిన “మారి 2” సినిమాలో రౌడీ బేబీ పాటతో… సాయి పల్లవి తన సొంత రాష్ట్రము తమిళనాడులో కూడా క్రేజ్ తెచ్చుకొంది.

సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి… శేఖర్ కమ్ముల తీసిన “లవ్ స్టోరీ”. రెండోది.. రానా హీరోగా రూపొందుతోన్న “విరాట పర్వం”.

Related Stories