సాయిపల్లవికి వ్యతిరేకంగా బీజేపీ ట్రోలింగ్

Sai Pallavi


సాయిపల్లవి చేసిన ఒక కామెంట్ మంటలు రేపింది. బలవంతుడు బలహీనులను టార్గెట్ చేసే ఏ చర్య అయినా అన్యాయమే అన్న అర్థంలో ఆమె చేసిన ఒక కామెంట్ బాగా వైరల్ అయింది. దాంతో, సోషల్ మీడియాలో ఆమెకి వ్యతిరేకంగా ట్రోలింగ్ జరుగుతోంది.

ఆమెని ట్రోల్ చేస్తున్న బ్యాచ్ అంతా బీజేపీకి చెందిన వారు లేదా బీజేపీ సానుభూతిపరులే కావడం గమనించదగ్గ పాయింట్.

మతం పేరుతో చేసే అల్లరి, హింస, ఒకప్పుడు కాశ్మీర్లో హిందూ పండిట్ లపై జరిగిన దాడులను నేడు గోవుల సంరక్షణ పేరుతో మైనార్టీలను కొంతమంది చేస్తున్న అరాచకాలను పోల్చి చూపింది సాయి పల్లవి. కాశ్మీర్లో అధికంగా ఉన్న ముస్లిం అతివాదులు హిందువులపై చేసిన దాడులైనా, నేడు హిందుత్వ వాదులు ముస్లింలను గోవుల పేరుతో వేధిస్తున్న దాడులైనా ఒకటే అన్నట్లుగా ఆమె మాట్లాడింది.

దాంతో, బీజేపీ భక్తులు, హిందుత్వ వాదులు సాయి పల్లవిపై భగ్గుమన్నారు. ఆమెకి వ్యతిరేకంగా ట్రెండింగ్ షురూ అయింది. ఆమె నటించిన ‘విరాటపర్వం’ సినిమాకి వ్యతిరేకంగా కూడా పోస్టులు పెడుతున్నారు.

 

More

Related Stories