సాయి పల్లవికి డిమాండ్

- Advertisement -
Sai Pallavi

లేటెస్ట్ జనరేషన్ హీరోయిన్లలో నటనతో చింపేసే భామ… సాయి పల్లవి. ఆమె యాక్టింగ్ మాములుగా ఉండదు. ఒక ఎక్స్ప్రెషన్ పెడితే ఎవరైనా ‘ఫిదా’ అవ్వాల్సిందే. ఇటీవల ఆమె నటించిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. అయినా, ఈ రౌడీ బేబీ క్రేజ్ తగ్గలేదు. ఇన్ ఫాక్ట్ మరింతగా పెరిగింది.

లేటెస్ట్ గా సాయి పల్లవిని చిరంజీవి కొత్త సినిమాకి కన్సిడర్ చేస్తున్నారట. ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అయింది అనేది టాక్. అది ఆమె రేంజు. మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టే “వేదాలమ్” రీమేక్ లో చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయి పల్లవిని తీసుకోనున్నారట. అలాగే, నాని నటించే మరో కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్.

మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి

 

More

Related Stories