విరాటపర్వం టీజర్ ఇంప్రెస్ చేసింది!

‘విరాటపర్వం’ టీజర్ కి రెస్పాన్స్ బాగుంది. ఈ మధ్య ఇన్ స్టాంట్ గా క్లిక్ అయిన టీజర్లలో ఇదొకటి. ఎప్పటిలాగే, సాయి పల్లవి మెస్మరైజ్ చేసింది. అలాగే, ఈ సినిమా దర్శకుడు వేణు అడుగుల ప్రతిభని టీజర్ బయట పెట్టింది. విజువల్స్, భావుకత అతని టాలెంట్ ని చూపెట్టింది.

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు వేణు ఉడుగుల. ఆ సినిమాతోనే మెప్పించాడు. ఇప్పుడు పెద్ద బడ్జెట్, మంచి మార్కెట్ ఉన్న హీరో ఉండడంతో తన ఆలోచనలకు భారీతనం జోడించాడు. ‘విరాట పర్వం’ సినిమా కథ… పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. ఐతే, సాయి పల్లవితో తెలంగాణ యాసలో కాకుండా మామూలుగానే మాట్లాడించాడు దర్శకుడు.

రెండేళ్ల క్రితం మొదలయిన ఈ మూవీ రానాకి అనారోగ్యం, కొవిడ్ 19 వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.

More

Related Stories