- Advertisement -

ఇటీవలే నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. “జవాన్” సినిమాలో ఆమె హీరోయిన్. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సాయి పల్లవి వంతు. సాయి పల్లవిని బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారట.
అమీర్ ఖాన్ తన కొడుకు జునైద్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. జునైద్ మొదటి చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించనుందట. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ న్యూస్.
సాయి పల్లవి కథ నచ్చితే సినిమా ఒప్పుకుంటుంది. ఆమెకి ఈ కథ నచ్చినట్లుంది. పైగా హిందీ చిత్రం కాబట్టి ఆమె చాలా ఆలోచించే ఈ సినిమా సైన్ చేసి ఉంటుంది.
‘లవ్ స్టోరీ’, ‘విరాటపర్వం’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల తర్వాత సాయి పల్లవి తెలుగులో ఇంకా కొత్త సినిమా ఒప్పుకోలేదు.