బన్నితో ఆమె నటించడం లేదు!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుంది. మొదటి భాగంలో నటించిన హీరోయిన్ రష్మిక మందానతో పాటు మిగతా తారాగణం కూడా రెండో భాగంలో కనిపిస్తారు. ఐతే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కొత్తగా వచ్చి చేరనుందని కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి.

అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్. ఆయన పక్కన సాయి పల్లవి లాంటి డ్యాన్సర్ చేస్తే ఇంకా అదిరిపోతుంది కదా. ఆ ఆలోచనతోనే చిన్న పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ ఆమెని సంప్రదించాడని టాక్ నడుస్తోంది. కానీ, ఇది అబద్దమని తేలింది. సాయి పల్లవి ‘పుష్ప 2’లో నటించడం లేదు.

ఆమెతో ఐటెం సాంగ్ కూడా చేయించలేరు. ఎందుకంటే ఆమె ఐటెం సాంగ్ లకు వ్యతిరేకం. సో, సాయి పల్లవి ‘పుష్ప 2’లో కనిపించదు.

Sai Pallavi

సాయి పల్లవి ఇటీవల నటించిన సినిమాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘గార్గి’ మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆమెకి. ‘విరాటపర్వం’ పేరు నిలబెట్టినా ఆ సినిమాతో వివాదాలు చుట్టుముట్టాయి. అలాగే, సినిమా కూడా అపజయం పాలైంది.

సాయి పల్లవి తన కొత్త సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు. ఆమె తెలుగులో మరో సినిమా ఇంకా సైన్ చెయ్యలేదు.

 

More

Related Stories