అందుకే మోడ్రన్ గా కనిపించను – సాయిపల్లవి

ఎప్పుడు చూసినా సంప్రదాయబద్దంగా కనిపిస్తుంది సాయిపల్లవి. సినిమాల్లోనైనా, బయట అయినా ఆమె చిన్న చిన్న డ్రెస్సుల్లో కనిపించదు. మోడ్రన్ వేర్ వేసుకోదు. కురుచ దుస్తులంటే సాయిపల్లవికి పడదా? మోడ్రన్ గా కనిపించడం ఆమెకు ఇష్టం ఉండదా? ఇదే ప్రశ్న ఆమెకు ఎదురైంది.

మోడ్రన్ గా కనిపించడం తనకు ఇష్టం ఉండదని సాయిపల్లవి తెలిపింది. దీనికి కారణాన్ని కూడా ఆమె బయటపెట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో ఓ సందర్భంలో మోడ్రన్ గా కనిపించాల్సి వచ్చిందని, అప్పుడు సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా చాలా కామెంట్స్ వచ్చాయని, అప్పట్నుంచి మెడ్రన్ దుస్తులు ధరించడం మానేశానని చెప్పుకొచ్చింది.

Sai Pallavi

“మెడిసిన్ కోసం జార్జియా వెళ్లాను. అక్కడ వారం రోజుల్లో టాంగో డాన్స్ నేర్పించే కోర్స్ చేద్దాం అనుకున్నాను. అయితే ఆ డాన్స్ కోసం ఓ రకమైన డ్రెస్ వేసుకోవాలి. మోకాళ్ల పైవరకు కనిపించే లాంటి డ్రెస్ వేసుకోవాలి. దాని కోసం అమ్మా-నాన్నకు కాల్ చేశాను. అమ్మ వద్దంది. కానీ నాన్న మాత్రం ఆ దేశంలో ఉన్నప్పుడు, ఆ దేశం డాన్స్ చేయాలనుకున్నప్పుడు అలాంటి డ్రెస్ వేసుకోవడంలో తప్పు లేదన్నారు. నేను ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ చేశాను. ప్రేమమ్ రిలీజ్ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. మోకాళ్ల పైవరకు నేను వేసుకున్న వీడియోను చాలామంది షేర్ చేశారు. చాలా కామెంట్స్ చేశారు. అప్పట్నుంచి మోడ్రన్ డ్రెస్సులు వేయడం మానేశాను.”

తన వైరల్ వీడియోలో కష్టపడి వేసిన డాన్స్ ను ఎవరూ చూడలేదని, కేవలం తొడలు కనిపించేలా వేసుకున్న డ్రెస్ ను మాత్రమే అంతా చూశారని.. అది తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. గ్లామర్ గా కనిపించే అమ్మాయిల్ని తను తప్పుబట్టనని, తను మాత్రం గ్లామర్ గా కనిపించనని తేల్చేసింది. 

 

More

Related Stories