ముద్దుకు, మీటూకి లింక్!

Sai Pallavi

తమన్న ఎలాగైతే ముద్దు సీన్లకి ఒప్పుకోదో సాయి పల్లవి కూడా వెండితెరపై ముద్దు సీన్లకి నో చెప్తుంది. ఆమె ఇంతవరకు ఏ ఒక్క సినిమాలో కూడా అలాంటి సీన్లలో నటించలేదు. ఐతే, ఒక సినిమాలో మాత్రం ఒక దర్శకుడు పట్టుబట్టాడట. ఆ సినిమాలో కిస్ సీన్ చెయ్యాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడట.

ఐతే, లక్కీగా “మీ టూ” ఉద్యమం ఆమెకి కలిసొచ్చిందట. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నా టైంలోనే మీ టూ ఉద్యమం జోరుగా సాగుతోంది. సినిమాల్లో అవకాశాల కోసమా హీరోయిన్లను లైంగికంగా వేధించడం, షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా రకరకాలుగా వేధిపులకు వ్యతిరేకంగా పలువురు హీరోయిన్లు గళం విప్పారు. ప్రపంచవ్యాప్తంగా “మీ టూ” ఉద్యమం చాలా మార్పులు తెచ్చింది.

“ఇలాగే ముద్దు సీను కోసం పట్టుపడితే, నిన్ను కూడా మీ టూ లో ఎక్స్ పోజ్ చేస్తుందేమో చూడు,” అని ఆ సినిమలో నటిస్తున్న హీరో దర్శకుడిని నవ్వుతూ హెచ్చరించడంతో సదరు దర్శకుడు భయపడిపోయాడట. ఆ తర్వాత ముద్దు ముచ్చట తీయలేదట. ఆలా మీ టూ తనకి కలిసొచ్చింది అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది సాయి పల్లవి.

Advertisement
 

More

Related Stories