తొందరేమీ లేదు: సాయి పల్లవి

Sai Pallavi

సాయి పల్లవి చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చింది. గతేడాది విడుదలైన ‘విరాటపర్వం’ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాలో నటించలేదు. అంటే ఏడాది పాటు తెలుగు వారికి దూరమైంది. ఈ రోజు ‘తండేల్’ మూవీ సినిమా ప్రారంభోత్సవంలో మెరిసింది.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

“అవును చాలా గ్యాప్ వచ్చింది. తండేల్ కథ నచ్చింది. అందుకే ఒప్పుకున్నాను. ఎక్కువ సినిమాలు చెయ్యాలన్న తొందర లేదు. కోరిక లేదు,” అని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ సినిమాలో ఆమె నాగ చైతన్యకి లవర్ గా నటిస్తోంది. పూర్తిగా మత్స్యకారుల జీవితాలకు సంబందించిన కథ ఇది.

ఐతే, సాయి పల్లవి త్వరలోనే హిందీలో కూడా ఒక మూవీ చెయ్యనుంది. తెలుగు అయినా, హిందీ అయినా, తమిళ్ అయినా ఆమె సినిమా సైన్ చెయ్యాలంటే ఆమెకి ఆ ప్రాజెక్ట్ బాగా నచ్చాలి. డబ్బులు సంపాదించుకోవాలి కదా అని సినిమాలు సైన్ చెయ్యదు. అందుకే ఆమెకి ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది.

సాయి పల్లవికి ఇప్పుడు 31 ఏళ్ళు. ఆమె పెళ్లి గురించి కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఆ ఊసు ఇప్పుడు లేదు.

 

More

Related Stories