ఆమె డ్యాన్స్ కి ఫిదా కావాల్సిందే!

సాయి పల్లవి వేసే డ్యాన్స్ స్టెప్పుల్లో ఒక గ్రేస్ ఉంటుంది. అందుకే ఆమె పాటలు అంతగా పాపులరవుతాయి. “వచ్చిండే” (ఫిదా) సాంగ్ అయినా, “రౌడీ బేబీ” సాంగ్ అయినా జనాలని ఊపెయ్యడానికి కారణం ఆమె స్టెప్పులోని మ్యాజిక్కే. ఆ జాబితాలోకి “సారంగి దరియా” చేరుతుందా?

శేఖర్ కమ్ముల తీస్తున్న “లవ్ స్టోరీ”లోని పాట ఇది. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఫోక్ సాంగ్ ఛాయలతో ట్యూన్ చేసిన ఈ సాంగ్ క్యాచీగా ఉంది. ఆమె డ్యాన్స్ స్టెప్పులు కూడా ఉన్నాయి ఈ వీడియోలో. ఇందులో ట్రాకింగ్ షాట్ లో ఆమె వేసిన స్టెప్పుకు ఫిదా కావాల్సిందే. ఇక ఫుల్ వీడియో వస్తే అది వైరల్ సాంగ్ గా మారడం గ్యారెంటీ.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది.

More

Related Stories