నిన్ను వదలా శ్యామ్…!

saisudha long

శ్యామ్ కే నాయుడు, సాయిసుధ వ్యవహారం ముందు నుంచి సినిమా డ్రామాను తలపిస్తోంది. నిజానికి ఇది కోర్టుకు వెళ్లాల్సిన వ్యవహారం కాదు. పోలీస్ స్టేషన్ లోనే సెటిల్ మెంట్ అయిపోతుందని భావించారు. కానీ అప్పట్లో శ్యామ్ కె నాయుడు చేసిన ఆలస్యం వల్ల, పోలీసులు తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల వివాదం కోర్టు వరకు వెళ్లింది.

అలా కోర్టు మెట్లు ఎక్కిన శ్యామ్ కే నాయుడు అప్పట్లో 2 రోజులు రిమాండ్ లో ఉంది కిందామీద పడి బెయిల్ తెచ్చుకున్నాడు. అలా బెయిల్ పై బయటకొచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్.. ఇప్పుడు కోరి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ లోనే రాజీ కుదుర్చుకున్నట్టు చెప్పిన ఈ కెమెరామెన్ అదే విషయాన్ని, కోర్టుకు చెప్పాడు. ఆ మేరకు పేపర్స్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు అవి నకిలీవని, సంతకాలు ఫోర్జరీ చేశారని స్వయంగా సాయిసుధ కోర్టుకు విన్నవించుకుంది.

దీంతో నాంపల్లి కోర్టు శ్యామ్ కె నాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడికి మంజూరు చేసిన బెయిల్ ను తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అక్కడితో ఆగకుండా.. తప్పుడు పత్రాలు సమర్పించినందుకు అతడిపై ఫోర్జరీ కేసు నమోదుచేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో శ్యామ్ కె నాయుడికి పెద్ద షాక్ తగిలినట్టయింది. అతడు ఏదో అవుతుందనుకున్నాడు, ఇప్పుడు ఇంకేదో అయింది. సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే చిరిగి చాట అయి చాపంత అయింది.

shyam k naidu saisudha

అన్ని ఆధారాలున్నాయి

ఇలా శ్యామ్ కె నాయుడ్ని ముప్పుతిప్పులు పెడుతోంది సాయిసుధ. నిజానికి ఆమె దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఆ ఆధారాలతోనే ఆమె ధైర్యంగా ముందడుగు వేస్తోంది. ఈ విషయం తెలియని శ్యామ్ కె నాయుడు.. సాయిసుధను లైట్ తీసుకున్నాడు. మహా అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందని అనుకున్నాడు. కానీ సాయిసుధ వదిలే రకం కాదని ఇప్పుడిప్పుడే అతడికి అర్థం అవుతోంది.

నిన్నటివరకు ఇది సివిల్ ఫ్యామిలీ కేసు మాత్రమే. కానీ ఇప్పుడిది ఫోర్జరీ కేసు కిందకు కూడా మారడంతో సదరు కెమెరామెన్ మరింత ఇరుక్కున్నాడు. సాయిసుధ వ్యవహారం రాజీతో కొలిక్కి రావొచ్చేమో కానీ, ఫోర్జరీ కేసు మాత్రం ఇతడ్ని వదిలేలా లేదు.

Related Stories