హోమ్ వర్క్ మొదలెట్టిన సాయితేజ్

Sai Tej and Deva Katta

రీసెంట్ గా సాయితేజ్ పెళ్లిపై చాలా స్టోరీలు వచ్చాయి. ఇంట్లో సంబంధం చూశారని, చిరంజీవి ఓకే చేశారని చాలా కథనాలొచ్చాయి. వీటిపై సాయితేజ్ రియాక్ట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ హీరో మాత్రం ఎంచక్కా తన పని తాను చేసుకుపోతున్నాడు. తనపై వచ్చిన పెళ్లి పుకారుపై క్లారిటీ ఇవ్వకుండా… కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చాడు.

దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి సంబంధించి హోం వర్క్ స్టార్ట్ చేశాడు ఈ మెగా హీరో. దేవకట్టాతో కలిసి డిస్కస్ చేస్తున్న పిక్ ను సోషల్ మీడియాలో పెట్టాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ప్రిపరేషన్ వర్క్ మొదలైందని, దేవ కట్టా తన రైటింగ్ తో అదరగొట్టేశాడని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి సాయి తేజ్ కు తన పెళ్లిపై స్పందించడం ఇష్టం లేదనే విషయం తేలిపోయింది. అతడి దృష్టి ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఉన్నట్టుంది.

ఇక దేవ కట్టాతో చేయబోయే సినిమా విషయానికొస్తే.. ఇంతకుముందు దేవ కట్టాకు పేరుతెచ్చి పెట్టిన ప్రస్థానం సినిమా టైపులోనే ఇది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.

Related Stories