
యాక్సిడెంట్ అయిన తర్వాత కోలుకొని పూర్తిగా ఇంటికే పరిమితమైన సాయిధరమ్ తేజ్, ఎట్టకేలకు తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ రోజు (మార్చి 28) సెట్స్ పైకి వచ్చాడు సాయితేజ్. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా సెట్స్ పైకి వచ్చిన ఈ మెగా హీరో చాలా ఎమోషనల్ అయ్యాడు.
ఈ సందర్భంగా యూనిట్ లో అందరికీ భోజనాలు పెట్టాడు. స్వయంగా తన చేత్తో అందరికీ భోజనం వడ్డించాడు.
యాక్సిడెంట్ నుంచి కోలుకొని, చాన్నాళ్ల తర్వాత సెట్స్ పైకి రావడంతో యూనిట్ కూడా భావోద్వేగానికి గురైంది. వెల్ కమ్ బ్యాక్ సాయితేజ్ అంటూ అపూర్వ స్వాగతం పలికింది. సెట్స్ లో అడుగుపెట్టిన సాయితేజ్ భావోద్వేగానికి గురయ్యాడు. కాసేపు అలానే కుర్చీలో కూర్చొని ఉండిపోయాడంట.
బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలుగా వస్తోంది ఈ కొత్త సినిమా. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లెక్కప్రకారం ఈ సినిమా ఈ పాటికే సెట్స్ పైకి రావాలి. కానీ యాక్సిడెంట్ కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడింది. ఈ సినిమాను పూర్తిచేసిన తర్వాతే మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు సాయితేజ్.
సాయితేజ, సాయిధరమ్ తేజ్, సాయి తేజ్,