సాయి తేజ్ మౌనం దేనికి?

Solo Brathuke So Better

సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకు సో బెటర్” కూడా ఓటిటిలోనే రిలీజ్ కానుందని తెలుగుసినిమా.కాం ఇప్పటికే రాసింది. జీ తెలుగు టీవీ సంస్థ ఈ సినిమా మొత్తం హక్కులను (టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేటర్ హక్కులు సహా) భారీ మొత్తానికి కొనుక్కొంది. ఐతే, థియేటర్ లో రిలీజ్ చెయ్యకుండా… డైరెక్ట్ గా జీ5 అప్ లోనే రిలీజ్ చెయ్యాలా అన్న విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదట.

ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ మౌనం పాటిస్తున్నాడు. నాని నటించిన సినిమానే డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల అవుతున్నప్పుడు సాయి తేజ్ ఆలోచించాల్సిన పని లేదు. మరి అతని మౌనం దేనికి.

సాయి ధరమ్ తేజ్ ఇటీవలే మల్లీ షూటింగ్ షురూ చేశాడు. ఈ సినిమాని ఈ నెల మొత్తం పూర్తి చెయ్యాలకునుంటున్నాడు. షూటింగ్ పూర్తి అయ్యాకే … ఓటిటి గురించి మాట్లాడుతాడేమో.

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ, ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా, జనాలు వస్తారా అనేది పెద్ద డౌటే. అందుకే, ఈ ఏడాదికి అన్ని సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ ల్లో రిలీజ్ చేసుకోవడమే బెటర్.

Related Stories