మెగా కాంపౌండ్ పై తేజ్ రియాక్షన్

“మెగా కాంపౌండ్ హీరో అంటే చాలు, అవకాశాలు క్యూ కడతాయి. హిట్-సక్సెస్ లాంటి బాధలు అక్కర్లేదు.” చాలామందికి ఇదే ఫీలింగ్ ఉంటుందని, కానీ అలాంటిదేం లేదంటున్నాడు హీరో సాయితేజ్. నిజంగా మెగా కాంపౌండ్ సపోర్ట్ తనకు ఉంటే, తొలి సినిమా రిలీజ్ అవ్వడానికి ఐదేళ్లు పట్టదని చెబుతున్నాడు.

“మెగా కాంపౌండ్ అనే ట్యాగ్ లైన్ మొదటి 2 సినిమాలకు కలిసిరావొచ్చు. అంతకుమించి ఇంకేం ఉండదు. ఆ తర్వాత మన హార్డ్ వర్క్, మన టాలెంట్ మాత్రమే పనిచేయాలి. టాలీవుడ్ లో నెపొటిజం అనే పదానికే తావులేదు. మన ఇండస్ట్రీలో అలాంటివేం ఉండవు. ఇక్కడ హార్ట్ వర్క్, టాలెంట్, సక్సెస్ మాత్రమే పనిచేయాలి. నిజంగా నెపొటిజం ఉంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఐదేళ్లు టైమ్ తీసుకోదు కదా. చిరంజీవి నా మేనమామ. కాబట్టి వెంటనే సినిమా రిలీజ్ అయిపోవాలి కదా. కానీ ఐదేళ్లు ఎందుకు పట్టింది?,” అని అడుగుతున్నాడు సాయి తేజ్.

ఇలా మెగా కాంపౌండ్ అనే ట్యాగ్ లైన్ పై స్పందించాడు సాయితేజ్.

మరోవైపు తానింకా బ్లాక్ బస్టర్ హీరో రేంజ్ కు ఎదగలేకపోయాననే కామెంట్స్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. తనకింకా చాలా టైమ్ ఉందని, తొందరపడకుండా మంచి మంచి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Related Stories