- Advertisement -

“సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు,” అని నిన్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన కోరిక మేరకే ‘రిపబ్లిక్’ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు మెగాస్టార్. ఐతే, సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా ప్రొమోషన్లకు వస్తాడా? దానికి సమాధానం నో అని చెప్పాలి.
సాయి ధరమ్ తేజ్ మరో 15, 20 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలోనే ఉంటారు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ సపోర్ట్ తీసిన మాట వాస్తవమే కానీ సాయి ధరమ్ తేజ్ చాలా వీక్ గా ఉన్నారని అంటున్నారు. జనం ముందుకు రావాలంటే నెల, రెండు నెలలు పట్టొచ్చు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంకా హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారట. తొందరపడి డిశ్చార్జ్ చెయ్యదల్చుకోలేదు.