విజయవాడలో సాయితేజ్ పూజలు

- Advertisement -
Sai Tej

యువ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక సినిమా షూటింగ్ లకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టేలోపు పూజలు, పుణ్యక్షేత్రాల పర్యటన ముగించే పనిలో ఉన్నారు సాయి తేజ్.

హైదరాబాద్ లోని మాదాపూర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి తేజ్ పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టింది. సాయి తేజ్ కోలుకుంటే బెజవాడ కనకదుర్గని దర్శించుకుంటానని ఆయన తల్లి మొక్కుకున్నారట. దాంతో ఈ రోజు బెజ‌వాడ వెళ్లి దుర్గమ్మని దర్శనం చేసుకుని వచ్చారు సాయి తేజ్.

ప్రమాదానికి ముందు సాయి తేజ్ ఒక కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తారు. అలాగే మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒక దాని తర్వాత మరోటి షురూ చేస్తారు.

సాయి తేజ్ మునుపటి ఫిట్ నెస్ ని తెచ్చుకున్నారు. ఐతే, ఆయన డైలాగ్ డెలివరీ మునుపటిలా ఉంటుందా అన్న డౌట్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే గొంతు వద్ద సర్జరీ జరిగింది.

More

Related Stories