లేటు సమ్మర్లో సాయి తేజ్!

Sai Dharam Tej

ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ తమ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఈ లిస్ట్ లో లేట్ గా, లేటెస్ట్ గా చేరిన మెగా హీరో… సాయి తేజ్. గత ఏడాది చివర్లో ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమాని విడుదల చేసి… జనాలని మళ్ళీ థియేటర్ల వైపు చూపు వేసేలా చేసిన ఆ హీరో మరోసారి థియేటర్ల ముందుకు రానున్నాడు.

దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రిపబ్లిక్’ కూడా లేట్ సమ్మర్ బరిలోకి దిగింది. జూన్ 2న విడుదల కానుంది ‘రిపబ్లిక్’. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్.

సమ్మర్ బరిలో మొదట్లోనే ఈ సినిమాని నిలపాలని అనుకున్నారు. ఐతే, ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ మూవీ, మే నెలలో మెగాస్టార్ సినిమా ఉండడంతో.. జూన్ వరకు ఆగాల్సి వచ్చింది సాయి తేజ్ కి. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా పూర్తి అవుతోంది.

More

Related Stories