​ఇక వరుణ్ తేజ్ పైనే ఆశలు!

Sakshi Vaidya

సాక్షి వైద్య… ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ, ఇండస్ట్రీ మాత్రం ఈ భామ పెద్ద హీరోయిన్ అయిపోతుంది అని భావించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెని అఖిల్ సరసన ‘ఏజెంట్’ సినిమాలో తీసుకోగానే ఈ మోడల్ తమ సినిమాలో బుక్ చెయ్యాలని ప్రయత్నించారు.

ఆ వరుసలో వెంటనే ఆమెకి అవకాశం ఇచ్చారు ‘ గాండీవధారి అర్జున’ మేకర్స్. ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆమెని ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో తీసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇటీవలే ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ఇప్పుడు ఈ భామ ఆశలన్నీ ఈ సినిమాపైనే.

‘ఏజెంట్’ విడుదలకు ముందు సాక్షి వైద్య చాలా టెక్కులు పోయింది. మీడియా మీట్ పెడితే ఫోటోగ్రాఫర్ లు ఎక్కువ ఫోటోలు తీసుకోకుండా వారించింది. ఒకటి రెండు, ఫోటోలు చాల్లే అంటూ వెళ్ళిపోయింది. పెద్ద హీరోయిన్ అయిపోయాను అని భ్రమల్లో ఉంది. కానీ, మొదటి ఆటకే ‘ఏజెంట్’ డిజాస్టర్ అనిపించుకొంది.

ఇప్పుడు సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి హీరోయిన్ ఉందన్న విషయం కూడా తెలియదు. ఆమె మళ్ళీ తనని తాను పరిచయం చేసుకోవాలి. వరుణ్ తేజ్ సినిమా ఆడితే కానీ ఆమెకి గుర్తింపు రాదు.

Advertisement
 

More

Related Stories