క్రేజ్ వచ్చేది అప్పుడే

Salaar

ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సలార్” అనేక సమస్యలు చూస్తోంది. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడడంతో క్రేజ్ తగ్గింది. మరోవైపు బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ మూవీ డిసెంబర్ 22న వస్తోంది. షారుక్ ఖాన్ నటించిన “డంకి”తో పోటీపడి ప్రభాస్ నెగ్గగలడా అనేది చాలా మంది అనుమానం. ఎందుకంటే ఇప్పుడు షారుక్ హవా నడుస్తోంది. మరోవైపు “సలార్ క్రేజ్ పడిపోయింది.

“సలార్”కి మళ్ళీ హైప్ రావాలంటే ట్రైలర్ విడుదల కావాలి. ట్రైలర్ అదిరిపోతే మళ్ళీ ఊపు వస్తుంది.

మరోవైపు, సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అనుకున్న తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ జత చేస్తున్నాడట. తాజాగా హైదరాబాద్ లో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

“గదర్ 2” సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన సిమ్రత్ కౌర్ ఈ ఐటెం సాంగ్ లో నటిస్తోందట. ఈ పాటతో సినిమాకి కొంచెం మాస్ లో ఊపొస్తుంది అని నీల్ భావిస్తున్నారు. మొదట సినిమాని పాటలు లేకుండా తీద్దామని భావించాడు. కానీ షూటింగ్ మొత్తం పూర్తి అయి ఎడిటింగ్ టేబుల్ వద్ద తీసింది చూసుకున్న తర్వాత “మసాలా దినుసులు” సరిపోలేదని అనుకున్న నీల్ ఈ ఐటెం సాంగ్ తో పాటు మరో పాట తీస్తున్నడట.

ఐతే, ఈ పాటల్లో ప్రభాస్ కనిపించడు. అందుకే, ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఆయన తన మోకాలికి సర్జరీ చేయించుకొని ఇటీవలే హైదరాబాద్ కి వచ్చారు. ఒక వారం రోజుల తర్వాతే షూటింగ్ లో పాల్గొంటారని టాక్.

Advertisement
 

More

Related Stories