సలార్ కి ఇప్పుడు కొత్త సమస్య

Salaar


ప్రభాస్ ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న అనేక చిత్రాల విషయంలో ఎప్పటికప్పుడు అటు అభిమానులకు, ఇటు ట్రేడ్ వర్గాలకు కన్ఫ్యూజనే. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఒకేసారి డేట్ ప్రకటించి అనేకసార్లు వాయిదా వేసుకుంటూ పోతున్నారు ప్రభాస్.

‘సాహో’ సినిమా విడుదల తేదీని మూడు సార్లు మార్చారు. ‘రాధేశ్యామ్’ డేట్ ఒక నాలుగు సార్లు మారి ఉంటుంది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ విషయంలో అదే జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు డేట్ మారింది. ముచ్చటగా మూడో సారి జనవరి 12 నుంచి జూన్ 16కి మార్చారు. ఆ డేట్ కి కూడా పక్కాగా వస్తుందా అన్నదే డౌట్.

ఇలా…. ప్రభాస్, ఆయనతో తీసే నిర్మాతలు డేట్లు మారుస్తూ ఇతర మేకర్స్ కి ఇబ్బంది పెడుతున్నారు. ప్రభాస్ తోనే ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ కూడా ఇప్పుడు ఇంకో తేదీని ఫిక్స్ చేసుకునే పనిలో పడింది. ఈ సినిమాని మొదట ఏప్రిల్ 2023లో విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2023 అని ప్రకటించారు. ఇప్పుడు దీని డేట్, ‘ఆదిపురుష్’ విడుదలని బట్టి ఉంటుంది.

‘సలార్’ కనుక 2024 సంక్రాంతికి మారిందంటే పెద్ద సమస్యే. ఎందుకంటే ‘ప్రాజెక్ట్ కే’ అనే మరో సినిమాకి 2024లోనే డేట్ ఫిక్స్ చెయ్యాలి.

 

More

Related Stories