సలార్ టార్గెట్ పెద్దదే

Salaar

“సలార్” విడుదలకు సరిగ్గా నెల రోజులకు ముందు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మగలిగారు నిర్మాత. భారీ రేట్లు చెప్పి ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్లని బెదరగొట్టారు నిర్మాత. ఐతే, ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చి అమ్మారు. అయినా కూడా అమ్మిన మొత్తం తక్కువేమీ కాదు.

“సలార్” ఏపీ, తెలంగాణ ఏరియాలకు కలిపి దాదాపు 165 కోట్లకి అమ్మారు. ఇంత మొత్తం రాబట్టలంటే సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. అట్లాంటి ఇట్లాంటి సూపర్ హిట్ కాదు భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి.

“సలార్” సినిమాకి ఆ క్రేజ్, రేంజ్ ఉంది. కానీ, ప్రభాస్ సినిమాలు ఇటీవల ఒక వారం కన్నా ఎక్కువ ఆడడం లేదు. ఆ భయమే అందరినీ వెంటాడుతోంది. కళ్ళు చెదిరే బ్లాక్ బస్టర్ కావాలి అంటే కనీసం 5,6 వారాలు ఆడాలి. కానీ, ఓపెనింగ్ ఎంత రికార్డు స్థాయిలో వచ్చినా మొదటివారం తర్వాత సినిమా పడుకుంటే కొన్నవాళ్లకు గిట్టుబాటు కాదు.

మరి, ఈ సారి “సలార్” ప్రభాస్ కున్న క్రేజ్, ఇమేజ్ కి తగ్గట్లు ఆడుతుందా లేదా అనేది చూడాలి. డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం పెద్ద టార్గెట్ ఇది.

Advertisement
 

More

Related Stories