సలార్ ఒకటా? రెండా?

Prabhas and Prashanth Neel

‘సలార్’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హీరో ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఈ నెలాఖరు నుంచి షూటింగ్ షురూ చేస్తారు. ఒక నెల రోజుల్లో దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. పాటలు మినహా మిగతా భాగం మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తారట.

ఐతే, ఆ తర్వాత పాటలు తీసి ఊరుకుంటారా? లేక రెండో భాగం షూటింగ్ మొదలు పెడుతారా అన్న విషయంలో క్లారిటీ లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాని రెండు భాగాలుగా తీయాలన్న మాట వాస్తవమే. హీరో ప్రభాస్ కి ఈ ఐడియా ఇష్టం లేదు. ఒకటే భాగంలో మొత్తం కథ చెప్పొచ్చు అనేది ఆయన భావన.

పైగా, చేస్తున్న చిత్రాలు, చెయ్యాల్సిన సినిమాల లిస్ట్ పెద్దది. ‘సలార్’ కాకుండా ఆయన ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సమయంలో ఆ మూవీ ప్రమోషన్స్ చెయ్యాలి. అలాగే ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ షూటింగ్ లో పాల్గొనాలి. అది కంప్లీట్ కాగానే దర్శకుడు సందీప్ వంగా తీసే ‘స్పిరిట్’ అనే సినిమా షురూ అవుతుంది. ఇవి కాకుండా, ‘పఠాన్’ దర్శకుడితో ఇంకో సినిమా చెయ్యాల్సిన ఒప్పందం ఉంది.

అందుకే, ఇప్పుడు ‘సలార్’ రెండు భాగాల కన్నా ఒక్క దానితో సరిపెట్టాలని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

 

More

Related Stories