
అనుకున్నదే జరిగింది. “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానుంది. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఎదో సమస్య. ప్రతి సినిమా అనేకసార్లు డేట్స్ మార్చుకుంటుంది. ఈ సారి “సలార్”కి కూడా అలాగే జరిగింది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది. డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు ప్రకటించారు.
సెప్టెంబర్ 28కి సినిమాని పూర్తి చేసి విడుదల చెయ్యలేక నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు ఇతర సినిమాల డేట్ మీద పడింది. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకొని “హాయ్ నాన్న”, “సైంధవ్”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్”, “హరోం హర” సినిమాలు చాలా నెలల క్రితమే తమ డేట్స్ ప్రకటించాయి. ఈ నాలుగు చిత్రాలు కూడా డిసెంబర్ 22/23న వస్తున్నాం అని ప్రకటించాయి. అదే విధంగా పబ్లిసిటీ కూడా మొదలు పెట్టాయి.
ఇప్పుడు “సలార్” కోసం ఇవి తప్పుకోవాలి. కొత్త డేట్స్ వెతుక్కోవాలి. “సలార్” నిర్మాతల తప్పిదానికి ఇవి తప్పుకోవాల్సి వస్తున్నాయి.
“హాయ్ నాన్న” చిత్రం డిసెంబర్ లోనే రెండు వారాలు ముందుకు డేట్ మార్చే అవకాశం ఉంది. “సైంధవ్” జనవరికి వెళ్తుందేమో.