ఇంగ్లీష్ లో రానున్న “సలార్”

- Advertisement -
Salaar

ప్రభాస్ నటించిన “సలార్” సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రాలన్నీ ఇలాగే విడుదల అవుతుంటాయి. ఐతే, ఈసారి ఈ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు సమాచారం.

ఇంగ్లీష్ లో డబ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరింత మార్కెట్ పొందొచ్చు అనేది భావన. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. పైగా, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాలను సులువుగానే ఇంగ్లీష్ లో అనువదించొచ్చు.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది “సలార్.” ఐతే, ఇంగ్లీష్ లో డబ్ చెయ్యాలంటే పెద్ద పని. అది పూర్తి చేసేంత టైం దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద ఉందా అనేది ప్రశ్న.

జపాన్, చైనా, ఇంగ్లీష్ వెర్షన్స్ ని తర్వాత విడుదల చేస్తారేమో. ‘సలార్’ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నాడు నీల్.

 

More

Related Stories