బన్నీలా చేస్తాడని ఎలా అనుకున్నారబ్బా!

Seetimaar from Radhe

‘డీజే’లో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ ముందు సల్మాన్ ఖాన్ “సీటిమార్”కి వేసిన స్టెప్పులు తేలిపోయాయి. అది ఊహించిందే. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా “రాధే”లో సీటీ మార్ సాంగ్ ని పెట్టారు. ఆ పాట బయటికొచ్చింది. అలా రాగానే ఇలా కామెంట్స్ షురూ. సల్మాన్ ఖాన్ స్టెప్పులు చూస్తే వాంతి వొస్తుందని కామెంట్స్ మొదలయ్యాయి.

నిజం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ కి డ్యాన్స్ రాదు. అది యూనివర్సల్ ఫ్యాక్ట్! అతను ఎక్కువగా బెల్ట్ స్టెప్పులు వేస్తాడు. అదేనండి… ప్యాంటుకున్న బెల్ట్ ని కిందికి, పైకి ఊపితే అదో స్టెప్పు అంతే. సల్మాన్ బన్నీలా చెయ్యలేదు అని కామెంట్ చేస్తున్నారు అంటే.. మీరు సల్మాన్ ఖాన్ సినిమాలు చూడలేదని అర్థం. లేదంటే.. బన్నీకి బన్ మస్కా రాస్తున్నారని అనుకోవాలి.

అల్లు అర్జున్ తన ఫస్ట్ మూవీ నుంచి డ్యాన్స్ తోనే పాపులర్ అయ్యాడు. అల్లు అర్జున్ ఇండియాలోనే బెస్ట్ డాన్స్ చేసే హీరోల్లో ఒకరు. ‘సీటిమార్’ సాంగ్ లో మరింత ఎనర్జిటిక్ గా స్టెప్పులేశాడు. సో…37ఏళ్ల బన్నీలా 55 ఏళ్ల సల్మాన్ ఎలా స్టెప్పులేస్తాడు? అయినా.. ఆ పాటకి, ఆ సినిమాకి దర్శకుడు ..డ్యాన్సులోనే గ్రేట్ అనిపించుకున్న ప్రభుదేవా. ఆయనకీ తెలీదా సల్మాన్ ఖాన్ లాంటి హీరోలకు ముఖం కప్పి డ్యాన్స్ చేయించాలని. అదే చేశాడు మరి.

అన్నట్లు… గత పాతిక ఏళ్లుగా ప్రభుదేవా ముఖానికి షర్ట్ కప్పుకొని డ్యాన్స్ చేసే స్టెప్పుని వదలట్లేదు.

More

Related Stories