నిజమే కలెక్షన్లుండవు… సల్మాన్ మాట

Radhe

సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమా మరో రెండు రోజుల్లో (మే 13న) విడుదల కానుంది. అటు థియేటర్లలో, ఇటు ఆన్ లైన్లో ఒకేసారి విడుదలవుతోంది. దేశంలో ఎక్కడా థియేటర్లు తెరిచిలేవు. అందుకే, ఈ సినిమాకి కలెక్షన్లు ఏమి ఉండవు అని ముందే చెప్పేస్తున్నాడు సల్మాన్ ఖాన్.

“ఎక్కడో కొన్ని చోట్ల థియేటర్లు తెరిచి ఉన్నాయి. తెరిచిన చోట కూడా జనం థియేటర్ కి వస్తారని అనుకోను. పూర్తిగా ఆన్ లైన్ పైనే ఆధారపద్దామనేది వాస్తవమే. ఇది రిస్క్ అని తెలుసు. కానీ తప్పదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు అడుగు ముందుకెయ్యాలి. నష్టం అని తెలిసి విడుదల చేస్తున్నాం. చూద్దాం అవుతుందో,” అంటూ అసలు విషయం చెప్పాడు సల్మాన్ ఖాన్.

ఈ సినిమాకి ఆన్ లైన్ లో కూడా పెద్దగా వసూళ్లు రాకపోవచ్చనే క్లారిటీ సల్మాన్ కి ఉంది. ఈ నష్టాన్ని వేరే విధంగా భర్తీ చేస్తాడట నిర్మాతలకు. అందుకే … వాళ్ళు రిస్క్ చేసి జీ ప్లెక్స్ లో విడుదల చేస్తున్నారు.

Also Check: Vishnupriya’s Saree Photoshoot – More pics

ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ‘రాధే’ సినిమాలో దిశా పటాని హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ ‘సీటిమార్’ అనే పాటని కంపోజ్ చేశాడు.

More

Related Stories