రంజాన్ కే ‘రాధే’, సల్మాన్ డేర్

Salman Khan in Radhe

సల్మాన్ ఖాన్ డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. ఈ రంజాన్ కే తన సినిమాని విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ‘రాధే’ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాని అటు థియేటర్లోనూ, ఇటు జీ ప్లెక్స్ కి చెందిన స్ట్రీమింగ్ సైట్ లో ‘పే పర్ వ్యూ’ పద్దతిలో ఒకేసారి వచ్చేనెల రంజాన్ పండుగ స్పెషల్ గా విడుదల కానుంది.

దేశమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ టైంలో సినిమాలని విడుదల చేయకూడదనే అన్ని పెద్ద సినిమాలు వాయిదా బాట పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో థియేటర్లు కూడా మూతపడ్డాయి. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా వెయిట్ చెయ్యకూడదని… జీ ప్లెక్స్ ఆన్లైన్ విడుదలకు ఒప్పుకున్నాడు. థియేటర్లో చూసే వాళ్ళు చూస్తారు (అప్పటికి ఎక్కడ థియేటర్లు ఓపెనైతే అక్కడ దీన్ని ప్రదర్శిస్తారు).

మిగతావారు జీ ప్లెక్స్ లో ఆన్లైన్ మెథడ్ లో అంతే థియేటర్ టికెట్ డబ్బులు కట్టి చూడాలి. ఇండియాలో ఒక పెద్ద హీరో సినిమా ఇలా విడుదల కావడం ఇదే ఫస్ట్ టైం. సల్మాన్ ఖాన్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు.

More

Related Stories