ఇక మిగిలింది సమంత మాత్రమే

లాక్ డౌన్ తర్వాత అక్కినేని కాంపౌండ్ నుంచి ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. నాగార్జున ఆల్రెడీ “వైల్డ్ డాగ్” షూట్ స్టార్ట్ చేశారు. నాగచైతన్య కూడా “లవ్ స్టోరీ” మొదలుపెట్టేశాడు. ఇక మిగిలింది సమంత మాత్రమే. ఆమె ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా వెయిటింగ్.

నిజానికి సమంత ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. అసలు సమంత నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటనే డిస్కషన్ జోరుగా సాగుతోంది. అశ్విన్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో ఓ సినిమా పైప్ లైన్ లో ఉంది. అయితే ఆ మూవీ సెట్స్ పైకి సమంత ఎప్పట్నుంచి వస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.

“గేమ్ ఓవర్” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు అశ్విన్. తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం మరో ఫిమేల్ ఓరియంటెడ్ కథ రాసుకున్నాడు. ఇందులో సమంత మూగ అమ్మాయిగా కనిపించనుందని టాక్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తారట.

Also Check: Samantha Akkineni Photos

ప్రస్తుతం సమంత సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో టెర్రస్ గార్డెనింగ్ చేసి, తను తినే కూరగాయల్ని తానే పండించుకుంది. ఓ డిజైనరీ బ్రాండ్ ను కూడా ప్రవేశపెట్టింది. యోగా-మెడిటేషన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ చూస్తుంటే ఇప్పట్లో సమంతకు సెట్స్ పైకి వచ్చే మూడ్ లేనట్టుంది.

Related Stories