
సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు నిర్మాతలు. ఆగస్టు 12న ‘యశోద’ విడుదలవుతుందనేది నిర్మాతల ప్రకటన.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుందట. కొత్త దర్శకులు తీస్తున్న ఈ సినిమాకి శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత.
ఐతే, ఆగస్టు 12న అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ కూడా రానుంది. ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి చాలా కాలమే అవుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ‘ఏజెంట్’ ఒక స్పై థ్రిల్లర్. సో, మాజీ మరిదితో సమంత బాక్సాఫీస్ వద్ద పోటీపడనుందన్నమాట.
సమంత, అఖిల్ సినిమాలు నిజంగా ఆ డేట్ కి వస్తాయా లేక డేట్ మార్చుకుంటాయా అనేది చూడాలి. ప్రస్తుతానికి రెండు సినిమాల మధ్య పోటీ కనిపిస్తోంది.
అన్నట్లు, సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో మాజీ భర్త నాగ చైతన్యని ఫాలో కావడం మానేసింది. కానీ, అఖిల్, ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఇంకా ఫాలో అవుతోంది.