బాలకృష్ణ సరసన నటించేందుకు హీరోయిన్లు ఒప్పుకోవడం లేదు. అలాంటి సమస్యే ఇద్దరు హీరోయిన్లకు ఉంది. సమంత, అనుష్క…. ఇద్దరూ ఇప్పుడు అలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చూస్తున్నారట.
సమంత, అనుష్కలకు హీరోల స్థాయిలోనే ఇమేజ్ ఉంది. వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ నిలిపారు. ఇలాంటి హీరోయిన్-ఓరియెంటెడ్ చిత్రాల్లో వారి సరసన నటించేందుకు తెలుగు హీరోలు ఎవరూ ఒప్పుకోవడం లేదట. అందుకే, అనుష్క, సమంత కోసం తమిళ, మలయాళ భాషల హీరోలను తీసుకొస్తున్నారు.
“భాగమతి” సినిమాలో అనుష్క సరసన ఉన్ని ముకుందన్ అనే మలయాళ యువ హీరో నటించాడు. ఇప్పుడు సమంత హీరోగా రూపొందుతోన్న “శాకుంతలం” అనే సినిమాలో మలయాళ సినిమా రంగానికే చెందిన దేవ్ మీనన్ అనే యువ హీరోని ఒప్పించారు. సమంత నటించిన “ఓ బేబీ”లో కూడా నాగ శౌర్య ఆమె సరసన నటించాడు. కానీ ఇప్పుడు నాగ శౌర్య కూడా హీరోగా బిజీ అయిపోయాడు.
మొత్తానికి, “సీనియర్” హీరోలకు హీరోయిన్లు దొరకడం ఎలా కష్టమవుతుందో, సీనియర్ హీరోయిన్లకు హీరోల సమస్య ఉందన్నమాట.