
సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నామని ప్రకటించగానే మొదట ఇన్ డైరెక్ట్ కామెంట్ చేసింది హీరో సిద్ధార్థ్. “మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు…” అనే అర్థంలో ట్వీట్ చేశారు సిద్ధార్థ్. తన ట్వీట్ లో సిద్ధూ సమంత ప్రస్తావన తీసుకురాలేదు. సమంత గురించే అతను ట్వీట్ చేసినట్లు అందులో లేదు. కానీ సమంత అభిమానులు అలాగే భావిస్తున్నారు. అందుకే, వారు ఇప్పుడు సిద్ధార్థ్ ని సోషల్ మీడియాలో తిడుతున్నారు.
సిద్ధార్థ్ అభిమానులు కూడా రంగంలోకి దిగి సమంతకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. నాగ చైతన్య, సమంత విడాకుల డిస్కషన్ ఇప్పుడు ఇలా టర్న్ తీసుకొంది.
నాగ చైతన్యతో ప్రేమలో పడకముందు సమంత సిద్ధార్థ్ తో నాలుగేళ్లు డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలుసు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న మాట నిజమే. ఐతే, ఇద్దరూ 2014లో విడిపోయారు. అదే టైములో సమంత మనం సినిమా షూటింగ్ లో చైతన్యతో ప్రేమలో పడడం, 2017లో పెళ్లి చేసుకోవడం జరిగాయి. ఇన్నాళ్లూ సిద్ధార్థ్ ఎప్పుడూ సమంతకి వ్యతిరేకంగా కామెంట్ చెయ్యలేదు.
అభిమానులు మాత్రం లేటెస్ట్ ట్వీట్ తో గొడవపడుతున్నారు.