ఏమి జరిగినా సమంతానే టార్గెట్!


కాజల్ తల్లి అయింది. ఆమె ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంలో ఆమెకో, ఆమె భర్తకో కంగ్రాట్స్ చెప్పాలి. కానీ, సమంతను నిందించడం విచిత్రం. సమంత లక్ష్యంగా కొంతమంది ట్రోలర్స్ పని చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ఏ హీరోయిన్ గర్భవతి దాల్చినా, డెలివరీ జరిగినా సమంతకే ట్రోలింగ్ దక్కుతోంది. తాజాగా కాజల్ తల్లి కావడంతో మీమ్స్ తో సమంతని డిస్టర్బ్ చేశారు.

Advertisement

దాంతో, కోపంతో ఊగిపోయిన సమంత “నా మౌనం బలహీనత అనుకోవద్దు” అంటూ ట్వీట్ చేసి, ట్రోలర్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

సమంత, నాగ చైతన్య విడిపోవడానికి ఆమె పిల్లలు వద్దనుకోవడమే కారణమనే అపోహలో ఉన్నారు కొందరు చైతన్య అభిమానులు, ట్రోలర్స్. దాంతో, వారు కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చింది అనగానే… “నువ్వు బంగారం. పెళ్లయిన ఏడాదికో గర్భం దాల్చావు. కానీ కొందరు ఉన్నారు…” అంటూ సమంతని ఇన్ డైరెక్ట్ గా దొప్పి పొడవడం మొదలు పెట్టారు.

ట్రోలర్స్ మరీ హద్దు మీరిపోతున్నారు. అందుకే, సమంత నుంచి ట్వీట్ వచ్చింది.

Advertisement
 

More

Related Stories