క్షమాపణలు చెప్పిన సమంత

- Advertisement -
Samantha


హీరోయిన్ సమంత క్షమాపణలు చెప్పింది. అది కూడా పబ్లిక్ గా. ఆమె కారణంగానే ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఆరు నెలలుగా ఆగిపోయింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం నుంచి కోలుకొంది. ఐతే, ‘ఖుషి’ షూటింగ్ మొదలు పెట్టకుండా ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది.

మరి ‘ఖుషి’ సంగతి ఏంటి అని ఒక విజయ్ దేవరకొండ అభిమాని ప్రశ్నిస్తే…సమాధానం ఇచింది. “విజయ్ దేవరకొండ అభిమానులు అందరికి నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను. ఖుషి త్వరలోనే మొదలవుతుంది,” అని రాసింది. ఆమె సమాధానం చూసి హీరో విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు.

“పూర్తిగా కోలుకొని, హాయిగా నవ్వుతూ సెట్ మీదికి రావాలని కొరుకుంటున్నామ”ని విజయ్ రాశాడు.

సమంత “ఖుషి” సినిమాని పట్టించుకోకుండా “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ మొదలు పెట్టడం దర్శకుడు శివ నిర్వాణకి నచ్చలేదు. ఈ సినిమాని వదిలి ఇంకో సినిమా చేసుకుంటాను అని బెదిరించాడు. ఆ వార్తలు బయటికి పొక్కడంతో సమంత ఫీల్ అయింది. అందుకే ఆమె ఇప్పుడు బహిరంగంగా ఇలా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

 

More

Related Stories