సమంతకి కంఫర్మ్ అయిందా?

Samantha


సమంత హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం. ‘ది ఫ్యామిలీమేన్’ అనే వెబ్ సిరీస్ తోనే ఆమె హిందీ ప్రేక్షకుల్లో పాపులారిటీ పొందింది. ఆ తర్వాత ‘పుష్ప’ హిందీ వర్షన్ పెద్ద హిట్ కావడం, ఆమె ఐటెం సాంగ్ బాగా పాపులర్ కావడం ఆమెకి కలిసొచ్చాయి. ఇప్పుడు హిందీలో మరో వెబ్ సిరీస్ చేస్తోంది.

బాలీవుడ్ లో బాగా హల్చల్ చేస్తోంది. కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షోకి కూడా హాజరు అయింది. మరి ముంబైలో ఇంత హంగామా చేస్తోన్న సమంత స్ట్రైట్ హిందీ సినిమా ఎప్పుడు చేయనుంది అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. దానికి సమాధానం దక్కింది.

సమంత హీరోయిన్ గా రూపొందే మొదటి బాలీవుడ్ చిత్రం గురించి ఒక న్యూస్ తాజాగా రౌండ్లు వేస్తోంది. బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ తీసే కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించనుంది అనేది టాక్. ‘విక్కీ డోనర్’, ‘బాలా’ వంటి సినిమాల కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా ఇందులో హీరోగా నటిస్తున్నాడట. ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె హిందీలో ఎంట్రీ ఇస్తోందని బాలీవుడ్ మీడియా చెప్తోంది.

ఐతే, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.

 

More

Related Stories