సమంత బాలీవుడ్ సినిమా ఎప్పుడు?

అప్పుడెప్పుడో వచ్చింది ఫ్యామిలీ మేన్ సీజన్-2. సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టిన సిరీస్ అది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో సమంతకు ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో సమంత వరుసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. సమంత కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఆమె తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయలేదు.

ఓ ఫిమేల్ సెంట్రిక్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు కొంతమంది సమంతను సంప్రదించినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక తాప్సికి చెందిన నిర్మాణ సంస్థలో కూడా సమంత నటించే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. కానీ దానిపై కూడా ఇప్పటివరకు ప్రకటన రాలేదు.

తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమాల కోసం సమంత ఎదురుచూస్తోంది. బి-గ్రేడ్ హీరోల సరసన కాకుండా, మెయిన్ హీరోల సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించాలని ఆమె అనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ లో తనకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నమైన ఇమేజ్ ను బాలీవుడ్ లో పొందాలని ఆమె కోరుకుంటోందట. అందుకే ఇప్పటివరకు ఆమె ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదంటున్నారు.

ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. యశోద సినిమా సెట్స్ పై ఉంది. అటు వరుణ్ ధావన్ తో కలిసి ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ఆల్రెడీ ప్రకటించిన మరో సినిమాను ఆమె స్టార్ట్ చేయాల్సి ఉంది.

 

More

Related Stories