సమంత… ఈ పేరు చాలు!

- Advertisement -
Samantha Akkineni

సమంత అసలు పేరు… సమంత రుత్ ప్రభు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ పేరుతోనే. కానీ ఆమె సమంత అనే పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయింది. పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా మారింది. సినిమా టైటిల్స్ లో కూడా సమంత అక్కినేని అని వేశారు.

ఐతే, డివోర్స్ ప్రకటనకి మూడు నెలల ముందే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమంత తన పేరులో అక్కినేని అనే ఇంటిపేరుని తొలగించింది. అప్పుడే సంథింగ్ సమస్య అని గుసగుసలు మొదలయ్యాయి. ఇంటి పేరుతో పాటు తన పేరుని కూడా కుదించుకొని “ఎస్” అనే మాత్రమే ఉంచింది నిన్నటివరకు.

ఇప్పుడు ఆమె మళ్ళీ “సమంత” అనే పేరుని వాడుకుంటోంది. ఇంటిపేరు లేదు, తోక లేదు. సింపుల్ గా సమంత.

 

More

Related Stories