సమంత అదొక్కటే ఎందుకు తీసేసింది?

Samantha

సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉంది. తన మిత్ర బృందంతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. వెకేషన్ లో ఉండగానే ఆమె ఒక పని చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ‘డివోర్స్’ ప్రకటన పోస్ట్ ని తొలగించింది.

గతేడాది అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంత తాము విడిపోతున్నట్లు ఒక స్టేట్ మెంట్ ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మొన్నటివరకు ఆ పోస్ట్ ని అలాగే ఉంచిన సమంత ఇప్పుడు దాని డిలీట్ చేసింది. దాంతో, రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసిపోతున్నారా అని ఆరా తీయడం మొదలుపెట్టారు వారి ఫ్యాన్స్.

కానీ, అలాంటిదేమి లేదంటున్నారు నాగ చైతన్య టీం. చైతన్య ఇప్పటికే ఖరాఖండీగా చెప్పేశాడు. ఇద్దరి మంచి కోసమే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని. ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని ఇటీవల “బంగార్రాజు” సినిమా ప్రమోషనలల్లో క్లారిటీ ఇచ్చేశాడు. అంటే, అతను సమంతని మర్చిపోయాడు. డివోర్స్ విషయంలో ఆయనలో ఏ మార్పు లేదు.

మరి సమంత ఈ ఒక్క పోస్ట్ ఎందుకు తొలగించినట్లు అనేది ఆమె అభిమానులని వేధిస్తోంది.

 

More

Related Stories