నేను అలా అనలేదు: సమంత

Samantha

సమంత, నాగ చైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ స్టార్ట్ చేశారు. శోభిత, నాగ చైతన్య లండన్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.

వీరిద్దరి గురించి సమంత స్పందించిందని, శోభితకి కన్నీళ్లే మిగులుతాయి అన్నట్లుగా సమంత మాట్లాడింది అని కొన్ని వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. కానీ, తాను అలా మాట్లాడలేదు అని ట్విట్టర్ లో పేర్కొంది సమంత. నాగ చైతన్య కొత్త గాళ్ ఫ్రెండ్ గురించి తాను ఏమి స్పందించలేదు అని చెప్పింది.

“నాగ చైతన్యతో ఎవరు ప్రేమలో ఉన్నా చివరికి మిగిలేది కన్నీళ్లే. నా విషయంలో అదే జరిగింది. ఇతరుల విషయంలో కూడా అదే జరుగుతుంది,” అని సమంత ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆ వెబ్ సైట్స్ రాశాయి. కానీ సమంత ఇచ్చిన క్లారిటీతో అసలు కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు ఎలాంటి ‘పులిహోర’ కలుపుతున్నాయో అర్థం అవుతోంది.

సమంత ఇటీవల ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ లలో భాగంగా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. ఐతే, ఆమె తన మాజీ భర్త కొత్త గాళ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి కామెంట్ చెయ్యలేదంట. మీడియా ఊహాగానాలు మాత్రమే అవి.

మరోవైపు, ఇటు నాగ చైతన్య కానీ, అటు శోభిత ధూళిపాళ కానీ తమ డేటింగ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.

Advertisement
 

More

Related Stories