చికిత్సకు ముందు ధ్యానం

Samantha

సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని సమంత నిర్ణయం తీసుకొందన్న విషయం తెలిసిందే. ‘ఖుషి’ సినిమా, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లు పూర్తి చేసిన ఆమె మరో ఏడాదిపాటు సినిమాల్లో నటించకూడదనుకుంటోంది. చాలా కాలంగా వేధిస్తున్న మయోసిటిస్ అనే వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స పొందేందుకు ఆమె త్వరలో అమెరికా వెళ్లనుంది.

ఐతే, దానికన్నా ముందు ఆమె మానసిక బలం కోసం ధ్యానం (మెడిటేషన్) సాధన చెయ్యడం ప్రారంభించింది. దీనివల్ల తనకి ప్రశాంతత దక్కినట్లు ఆమె వెల్లడించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ధ్యానం చేస్తున్న ఫోటోలను, వీడియోలను సమంత షేర్ చేసింది.

“కొంతకాలం క్రితం వరకు నిశ్శబ్దంగా, నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యం అనిపించింది. గోక్కోవడమో, ఎదో ఒకటి ఆలోచించడమో, అటు ఇటు తిరగడమే చేసేదాన్ని. కానీ నేడు ధ్యానం నా శక్తి. ఇప్పుడు ప్రశాంతత దొరికింది. స్పష్టత వచ్చింది. ఒక కనెక్షన్ ఏర్పడింది. ఒక సాధారణమైన ధ్యానం ఇంత శక్తినిస్తుంది అని ఎవరనుకున్నారు,” అని ఆమె రాసుకొంది.

అంతకుముందు హైదరాబాద్, ముంబైలలో తీసుకున్న చికిత్సవల్ల “మయోసిటిస్” నుంచి కొంత ఉపశమనం పొందింది సమంత. కానీ అది పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఆమె తన దినచర్యలను సరిగ్గా చెయ్యలేకపోతోంది. అలాగే, షూటింగ్ ల్లో పాల్గొంటే త్వరగా అలిసిపోతోందట. అందుకే, ఏడాది పాటు చికిత్స, విశ్రాంతి.

Advertisement
 

More

Related Stories