లండన్ వెళ్ళిపోయిన సమంత

Samantha

‘శాకుంతలం’ సినిమా సమంతకి ఒక పెద్ద షాక్. సినిమా హిట్ కాకపోయినా ఆమె పెద్దగా బాధపడేది కాదు. కానీ, దారుణంగా పరాజయం పాలు అయింది. కలెక్షన్లు ఆల్మోస్ట్ నిల్. అంత ఘోరంగా ఫ్లాప్ అవుతుందని ఆమె ఊహించలేదు. ముఖ్యంగా ఆలిండియా లెవల్లో పరువు పోయింది. అందుకే, ఈ బాధని మర్చిపోవాలని విడుదలైన మూడో రోజుకే లండన్ కి వెళ్ళిపోయింది.

సమంత ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె లండన్ వెళ్ళింది. యాక్చువల్ గా ఆమె వచ్చేవారం లండన్ వెళ్ళాలి. కానీ, ‘శాకుంతలం షాక్ ని మర్చిపోవాలంటే వెంటనే వేరే షూటింగ్ లో పాల్గొనడం బెటర్ అని వెళ్ళిపోయింది.

రిలీజ్ కి రెండు రోజుల ముందే ఆమె జ్వరం అని చెప్పి ప్రమోషన్స్ ఆపేసింది. ఎందుకంటే రిలీజ్ కి నాలుగు రోజుల ముందు నిర్వహించిన ప్రీమియర్ షోతో ఆమెకి అర్థం అయిపోయింది. ఈ సినిమా ఫ్లాప్ కానుంది అనే ఆమెకి తెలిసిపోయింది. కానీ, ఈ రేంజ్ అపజయం ఆమె ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.

‘సిటాడెల్’ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చి ఆమె మళ్ళీ ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో.

Advertisement
 

More

Related Stories