సమంతకి జోరుగా ఆ ఆఫర్లు

Samantha


సమంత ఏమి చేసినా క్రేజ్ వస్తుంది. ఆమె హీరోయిన్ గా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఐటెం గర్ల్ గా కూడా సక్సెస్ అయింది. ఆమె నటించిన మొదటి ఐటెం సాంగ్… “ఊ అంటావా మావా”. “పుష్ప” సినిమాలోని ఆ పాట ఆల్ ఇండియా సెన్సేషన్.

అందుకే, ఇప్పుడు సమంతకి ఐటెం సాంగ్ ఆఫర్లు జోరుగా వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా అలాంటి పాటలు చెయ్యమని అడుగుతున్నారట.

గతంలో బాలీవుడ్ బడా హీరోయిన్లు కరీనా, కత్రినా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసేవారు. ఇప్పుడు సమంత కూడా అలాంటి క్రేజ్ తెచ్చుకొంది ఐటెంభామగా. మరీ నాటు భంగిమలకు కూడా తాను సిద్ధమని “పుష్ప”లో చూపించింది. అందుకే… మరి ఐటెం ఆఫర్లు.

‘పుష్ప’ సినిమాలో ఆ పాట చేసినందుకు కోటిన్నర పుచ్చుకొంది. మరి, బాలీవుడ్ మూవీ అంటే ఇంకా ఎక్కువే వస్తుంది. సో… ఆమె ఈ విషయంలో ‘తగ్గేదే లే’ అని రెచ్చిపోతుందేమో.

Samantha in Pushpa
Advertisement
 

More

Related Stories