- Advertisement -

హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. మీడియాలో ఎన్నో వార్తలు. కానీ, ఆమె ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, అక్కినేని కుటుంబానికి బంధువు అయిన శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి ఆమె గోవాలో సేదదీరుతోంది.
ప్రతి ఆదివారం ఆమె గడిచిన వారానికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శిల్పారెడ్డి కుటుంబంతో ఆమె ట్రిప్పు ఫోటోలను షేర్ చేసింది సమంత.
సమంత చేతిలో ప్రస్తుతం ఒక చిత్రం ఉంది. నయనతార కాబోయే భర్త విగ్నేష్ నయనతార, సమంత, విజయ్ సేతుపతిలతో తీస్తున్న మూవీ సెట్స్ పై ఉంది. ‘శాకుంతలం’ షూటింగ్ ఆమె పూర్తి చేసింది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.