బోర్ అంటూనే అదే క్యాసెట్

- Advertisement -
Samantha


సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత చైతన్య అభిమానులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ట్రాల్లర్స్ శృతిమించిపోయారు. హద్దులు దాటి సమంతని విలన్ చేసే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆ సమయంలో సమంత చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టులో పరువునష్టం దావా వేసి ట్రోలింగ్ న్యూసెన్స్ కి చెక్ పెట్టి శభాష్ అనిపించుకున్నారు.

అలాగే, తమ డివోర్స్ కి సంబంధించి ఆమె పెదవి విప్పలేదు. నాగ చైతన్య ఐతే ఈ రోజు వరకు ఒక్క ముక్క కూడా దాని గురించి మాట్లాడలేదు. ఐతే, సమంతకి ఇటీవల ముంబై వెళ్లిన తర్వాత తన డిగ్నిఫైడ్ సైలెన్స్ కి గుడ్ బై చెప్పింది. అక్కడి మీడియాకి అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.

అసలు ఏమి జరిగింది అనేది చెప్పలేదు కానీ… ట్రోలింగ్ గురించి, తనని ఎలా బద్నామ్ చేశారు అనే విషయాన్నీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ ఇంటర్వ్యూలు తెలుగు మీడియాలో కూడా వచ్చాయి. దాదాపుగా అన్ని ఇంటర్వ్యూలలో ఒకటే క్యాసెట్ వేసింది సమంత.

ఇప్పుడు మళ్ళీ ఇక దాని గురించి మాట్లాడను అంటోంది. అదే విషయం చెప్పడం బోర్ కొడుతోందని అంటోంది. జనం మర్చిపోయిన విషయాన్ని ఆమె మాట్లాడి, మళ్ళీ ఆమె బోర్ కొడుతోంది అని అంటోంది. ఇక నాగ చైతన్య మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ విషయమే తన జీవితంలో జరగలేదు అన్నట్లుగా ఉంటున్నాడు.

 

More

Related Stories